లగచర్ల ఘటనలో రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అనే మొక్కను మొలవనియ్యని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఏమి అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విజయోత్సవాలు జరుపుకునేంత స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లేదని కామెంట్ చేశారు. రైతులను మోసం చేయడం, రైతుల భూములను లాక్కోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందేనని అన్నారు.
విజయోత్సవాల పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్ నుంచి ఫార్మా కంపెనీ నుంచి వచ్చే జలాల వల్లనే మూసీ నీరు కలుషితమైందని తెలిపారు. కేసీఆర్ పాలనను గుర్తుకు తెచ్చేలా రాష్ట్రంలో రేవంత్ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై సీపీఎం పోరాటం చేస్తుందని.. రేపు లగచర్ల పర్యటించి వాస్తవాలను తెలుసుకుంటామని అన్నారు తమ్మినేని వీరభద్రం.