కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్

-

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల కొంగు బంగారం అయినటువంటి  కురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు.. సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ వేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కురుమూర్తి స్వామి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు.

వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం తన 45 నిమిషాల ప్రసంగంలో 55 సార్లు కేసీఆర్ ని గుర్తుకు తెచ్చుకున్నారని.. ఇవాళ వేములవాడలో కూడా అదే పరిస్థితి అన్నారు. కేసీఆర్ అంటే రేవంత్ కి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్లు, ఒట్టు తప్ప ఏమీ రావని తెలిపారు. 11నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందని ఏమి లేదన్నారు హరీశ్ రావు. రుణమాఫీ చేయకముందే తనను రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదని.. కానీ తనను రాజీనామా చేయమంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news