భద్రాద్రి రాముడి సాక్షిగా.. ఆగస్టు 15లోపు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పడిపోబోతుందని మాజీ సీఎం కేసీఆర్ వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు. మానుకోట గడ్డ మీద శపథం చేసి చెబుతున్నా.. పదేళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. తన కూతురు కోసం మోడీ కాళ్ల దగ్గర తెలంగాణను కేసీఆర్ తాకట్టుపెట్టారని పేర్కొన్నారు.
మమ్మల్నీ ఎవ్వరూ కదపలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి అల్లాటప్పగా రాలేదు. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు. ప్రజలకు ప్రజా పాలన అందుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసిందన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ లకు లేదన్నారు. తెలంగాణను పదేళ్ల పాటు బీజేపీ మోసం చేసిందని.. విభజన చట్టం ప్రకారం.. ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలోనే కాదు.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని.. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.