స్థానిక సంస్థల్లో మెరుగైన ఫలితాలు రాకుంటే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇవ్వం : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

-

స్థానిక సంస్థల్లో మెరుగైన ఫలితాలు రాకుంటే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇవ్వమని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తాజాగా మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత వారిని, కొత్త వారిని కలుపుకొని పోవాలని సూచించారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఫస్ట్ ఛాయిస్ ఇవ్వాలన్నారు. తొలుత పార్టీలో పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు.

మరోవైపు ఇటీవలే  పీసీసీ చీఫ్..  ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ గాంధీ భవన్ కి రావాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం అంటే సచివాలయం, అసెంబ్లీ అని.. ముఖ్యమంత్రి, మంత్రులే కాదు.. ప్రభుత్వం పార్టీ కూడా ఒక భాగమే అని చెప్పాలనుకుంటున్నట్టు తెలిపారు. నెలకొకసారి అయిన సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో అందుబాటులో ఉండాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్. అలాగే మంత్రులు వారానికి రెండు సార్లు పార్టీ క్యాడర్ కష్ట, నష్టాలను తెలుసుకునే విధంగా గాంధీ భవన్ కి రావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version