కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకుంటే ఆ పని చెయ్యాలి : కేటీఆర్

-

భారతీయ జనతా పార్టీకి ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్న కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం జరిగిన అక్రమాల పైన ఎందుకు మాట్లాడటం లేదు అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ కుమక్కు కాకుంటే పూర్తిస్థాయి ఎంక్వైరీ విచారణకు కేంద్రం ఆదేశించాలి. అమృత్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకుంటే, బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పరిధిలోని ఈ పథకం లో జరుగుతున్న అవినీతిపైన వెంటనే విచారణకు ఆదేశించాలి. లేకుంటే రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ నేతలకు అవినీతితో సంబంధం ఉంది అనుకోవాల్సి వస్తుంది అని అన్నారు.

అలాగే ఈ విషయంలో స్పందించకుంటే మీ కుమ్మక్కు రాజకీయాలు అర్థమవుతాయి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రెడ్డి మాట్లాడిన తర్వాత కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ మౌనం వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తనకు నచ్చిన విచారణ సంస్థతో ఈ అంశంలో విచారణ చేయించాలి. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ప్రేమ కథ నడుస్తుంది. అందుకే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్లు ముఖ్యమంత్రి శుద్ధపూస అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version