తెనాలిలో దారుణం…బౌన్సర్‌ దారుణ హత్య !

-

గుంటూరు తెనాలిలో దారుణం చోటు చేసుకుంది…బౌన్సర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలిలో కోటేశ్వరరావు అనే యువకుడి దారుణ హత్య జరిగింది. మృతుడు బుర్రిపాలెం కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. మృతుడు గతం లో పలువురు విఐపి ల దగ్గర బౌన్సర్ గా పని చేసినట్లు సమాచారం అందుతోంది.

Atrocious in Tenali… Bouncer brutally murdered

పోలీసుల వద్ద కూడా ప్రైవేటు డ్రైవర్ గా గతంలో పనిచేశారట కోటేశ్వరరావు. గత కొంతకాలంగా హైదరాబాదులో ఉంటూ, ఇటీవల తెనాలికి చేరుకున్నారు కోటేశ్వరరావు.. అయితే… రాత్రి మద్యం మత్తులో ఉన్న కోటేశ్వరరావు పీక కోసి హత్య చేశారు దుండగులు. ఇక స్థానికుల ఘటనా స్థలానికి చేరుకుని కేసు బుక్‌ చేశారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు…నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version