హైదరాబాద్ నగరంలో కూడా షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ తీసుకువస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జపాన్ దేశం టోక్యో నగరంలో హచుకో రైల్వే స్టేషన్ వద్ద గల షిబుయా క్రాసింగ్ ను సందర్శించడం జరిగిందన్నారు. ఇక్కడ ఒకేసారిగా 3,000 మంది పాదచారులు రోజుకు కనీసం 5 లక్షల మంది ఒక్క చిన్న ప్రమాదం జరగకుండా రైల్వే మరియు రోడ్డు కూడలి రోడ్లు దాటడానికి చేసిన ఏర్పాటు అద్భతం అని సోషల్ మీడియా ప్రకటించారు.
హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ పద్ధతిని అమలు పరచడానికి వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికత గురించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ తీసుకువస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.