హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని శ్రీ గుడ్ డే బార్ లో దారుణం జరిగింది. పవన్ కుమార్ (25) పై శ్రవణ్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో కొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి 11గంటల సమయంలో జరిగిన సంఘటన జరిగింది.

బార్ లో హరి, శ్రవణ్ కి మధ్య గొడవ, మద్యలో గొడవను ఆపడానికి వెళ్లారు పవన్ కుమార్ (25).. హరి, శ్రవణ్, పవన్ కుమార్ లు అందరూ పరిచయస్తులే..అందరూ కూడా అంబర్ పేట నివాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాడీని గాంధీ మార్చురీకి తరలించి నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.