ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా ఆటోల బంద్

-

ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా ఆటోల బంద్ కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఏడో తేదీన ఆటో బంద్ కు పిలుపునిచ్చింది తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్ అసోసియేషన్. రేపు జరగబోయే పెద్ద పెళ్లి సీఎం సభలో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్ డిమాండ్‌ చేస్తోంది.

Autos strike in Telangana Today

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం…. రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యంతో 60 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైందని ఆగ్రహించింది తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్.

ఆటో కార్మికుల కొరకు మేనిఫెస్టో లో పెట్టిన సంక్షేమ బోర్డులు సంవత్సరానికి 12000 రూపాయల హామీ ఏమైంది అని ప్రశ్నించింది తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్. మేనిఫెస్టో చైర్మన్గా మంత్రి శ్రీధర్ బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల సమస్యలపై ఎందుకు గళం మెత్తడం లేదని… రేపు పెద్దపల్లిలో జరగబోయే సీఎం సభలో ఆటో డ్రైవర్లకు కచ్చితంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది T JAC.

 

Read more RELATED
Recommended to you

Latest news