హనుమకొండ జిల్లాలోని మడికొండలో బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాలబాట తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధిక రెడ్డి, రవి నాయక్‌లను పోలీసులు అడ్డుకున్నారు.లోనికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ వారితో పాటు 50 మంది కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి మడికొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆ సమయంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకుల పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఆ విషయాన్ని బట్టబయలు చేస్తామనే తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.