Balakrishna 50 Years Event: తెలంగాణ ఉద్యోగులపై దాడి.. బాలయ్య పై రేవంత్ ఆగ్రహం? 

-

 

 

ఇటీవల కాలంలోనే బాలకృష్ణ స్వరోత్సవం కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసిన ఆదివారం రోజున… బాలకృష్ణ స్వర్ణోత్సవం ఈవెంట్ జరిగింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి… రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావాలి. కానీ ఇద్దరు రాలేదు. అయితే ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్లకపోవడానికి వెనుక పెద్ద కారణం ఉందట.

 

బాలకృష్ణ స్వర్ణోత్సవంలో తెలంగాణ సీఎంఓ ఉద్యోగుల మీద శ్రేయాస్ ఈవెంట్‌ నిర్వాహకుల దాడి జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసి అక్కడకు సీఎంఓ చానల్‌ నిర్వహిస్తున్న ఏజెన్సీ సావీ మీడియా వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ ధర్నాలో లైవ్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఈవెంట్‌ నిర్వాహకులు… అడ్డుకున్నట్లు సమాచారం.

 

లైవ్‌కు అనుమతి లేదని చెప్పడంతో సీఎంఓ ఏజెన్సీ వారు వాగ్వాదం. చొక్కాలు విప్పి అరుణ్ అనే ఉద్యోగిపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా ఈవెంట్‌కు రేవంత్‌ వెళ్లలేదని సమాచారం అందుతోంది. ఇక ఈ వ్యవహారం బయటకు రాకుండా చాలా రహస్యంగా ఉంచారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version