బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా అని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వేదికగా జరిగిన బీసీ మహా గర్జన ధర్నాలో చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. రాజ్యాంగం లోని ఆర్టికల్ 243 ప్రకారం.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా డెడికేషన్ కమిషన్ వేసుకొని చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లను అమలు చేసుకునే అధికారం ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు.
ఎన్నికల్లో ఆ హామీ ఇచ్చే సమయంలో మోడీ ప్రభుత్వాన్ని సంప్రదించి ఇచ్చారా..? ఇప్పుడు ఎందుకు మోడీ ప్రభుత్వం పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతులు పట్టుకొని షో చేయడం కాదు ఆ రాజ్యాంగంలో ఏముందో అర్థం చేసుకొని అమలు చేయాలని ఇంగిత జ్ఞానం కాంగ్రెస్ నేతలకు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ ఉంది. టిఆర్ఎస్ సపోర్ట్ కూడా ఉంది. అలాంటప్పుడు బిజెపి పై నేపము ఎందుకు నేర్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.