మళ్లీ మస్కే టాప్.. ఆసియాలో ముకేశ్ అంబానీ నంబర్​ వన్

-

ప్రపంచ కుబేరుడిగా టెస్లా, స్పేస్‌ ఎక్స్‌, ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ఘనత సాధించారు. ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా-2025లో ప్రపంచ కుబేరుడు ఆయన మళ్లీ నంబర్ వన్ గా నిలిచారు. రూ.28.3 లక్షల కోట్ల నికర విలువతో మస్క్‌ తొలిస్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద గతేడాదితో పోలిస్తే రూ.12 లక్షల కోట్ల పైగా పెరిగినట్లు ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది. ఇక రెండో స్థానంలో రూ.17.9 లక్షల కోట్ల సంపదతో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌.. మూడోస్థానంలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ రూ.17.8 లక్షల కోట్ల నికర విలువ నిలిచారు.


ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో భారత్‌ తరఫున ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ మరోసారి టాప్ లో నిలిచారు. రూ.7.6 లక్షల కోట్ల సంపదతో ఆయన ప్రపంచంలో 18వ స్థానంలో ఉండగా.. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక మరో భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రూ.4.6 లక్షల కోట్ల సంపదతో ఈ జాబితాలో 28వ స్థానంలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news