బండి సంజయ్ గృహ నిర్బంధం

-

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ టికెట్ ఛార్జీలను మరోసారి పెంచింది. పెరిగిన డిజిల్ ధరలకు అనుగుణంగా డిజిల్ సెస్ ను పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు సర్వీసులతో పాటు డీలక్స్, ఏసీ బస్సులపై డిజిల్ సెస్ పెంచింది. దీంతో టికెట్ ఛార్జీలు మరోసారి పెరిగినట్లు అయింది. దీంతో సామాన్యుడిపై భారం పడనుంది. అయితే తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులపై, గ్రేటర్  ప్రయాణికులపై భారం పడకుండా టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది. 

ఇదిలా ఉంటే పెరిగిన టికెట్ ఛార్జీలపై బీజేపీ పోరుబాట పట్టింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటి ముందు భారీగా పోలీస్ మోహరించారు. బండి సంజయ్ గృహ నిర్బంధం చేశారు పోలీసులు. జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో బండి సంజయ్ అక్కడికి వెళ్తారేమోనని మోహరించిన పోలీసులు. మరోవైపు ఈ రోజు ఉదయం 9.30 గంటలకు జూబ్లీ బస్ స్టేషన్ లో బండి సంజయ్, ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కూకట్ పల్లిలో మోదీ 8 ఏళ్ల పాలనపై జరిగే సభలో బండి సంజయ్ పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version