ముగిసిన ఆత్మకూరు నామినేషన్ ఉపసంహరణ గడువు.. బరిలో 14 మంది

-

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియంతో పోటీపడే అభ్యర్థుల తుది జాబితా కొలిక్కి వచ్చింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 13 తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 15 మంది బరిలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరణ చివరి రోజైన నిన్న బొర్రా సుబ్బారెడ్డి అనే వ్యక్తి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బరిలో 14 మంది నిలిచారు.

ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుండగా 26న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఉప ఎన్నికలో వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ తరపున భరత్ కుమార్ పోటీలో ఉండగా, బీఎస్‌పీ తరపున నందా ఓబులేసు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు మాత్రం పోటీకి దూరంగా ఉన్నాయి. ఉప ఎన్నికలో మొత్తం 2,13,330 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కూడా అందుబాటులో ఉండనుంది. వికలాంగులు, వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version