అధ్యక్ష మార్పు అనేది వట్టి ప్రచారమే : బండి సంజయ్

-

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. ‘కమిట్మెంట్ తో పనిచేస్తూ పార్టీ కోసం కష్టపడతా. మీడియా కథనాలు పట్టించుకోను. అధ్యక్ష మార్పుపై చర్చ ప్రచారం మాత్రమే. అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటించినా కట్టుబడి పని చేస్తా. ప్రచారాలను నమ్మి పని ఆపలేను. సిబిఐ, ఈడి విచారణతో బిజెపికి సంబంధం లేదు.

ఏ పార్టీలో ఉన్నా దొంగలకు శిక్ష తప్పదు’ అని స్పష్టం చేశారు. రాజకీయాలను శాసించేది ప్రజలు కానీ. నాయకుల గ్రూప్ కాదన్నారు బండి సంజయ్. తెలంగాణలో రెండు సార్లు బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ప్రజలు అనుకున్నారు.. ఓటు వేశారు … రెండు సార్లు ఆ పార్టీ అవిరి అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలు బీజేపీ నే ప్రత్యామ్నాయం అనుకుంటున్నారని పేర్కొ న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తారు తప్ప… పక్క రాష్ట్రా లను చూసి కాదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version