WTC Final 2023 : అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్ గిల్ బలి!

-

WTC Final 2023 ఫైనల్‌ మ్యాచ్‌ లో అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్ గిల్ బలి అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ గిల్ క్యాచ్ అవుట్ అవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై గిల్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. థర్డ్ అంపైర్ కు కళ్లు కనిపించవా అని అర్థం వచ్చేలా గ్రీన్ క్యాచ్ పట్టేటప్పుడు బాల్ నేలకు తాకిన ఫోటోను షేర్ చేశారు.

భూతద్దాల ఎమోజీలతో సెటైర్లు వేశారు. కాగా, ఇది నాటౌట్ అని భారత ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరేత్తిస్తున్నారు. ఈ క్యాచ్ విషయంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ సేహ్వాగ్ పూర్తిగా తప్పు పట్టారు. ‘గిల్ ఔట్ అయిన క్యాచ్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అంపైర్లు కళ్ళకు గంతలు కట్టుకున్నారేమో. ఇదే ఇలా సందేహాస్పదంగా ఉన్నప్పుడు అది నాటౌట్ అవుతుంది’ అని పోస్ట్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version