ముఖ్యమంత్రి కావాలని నేను అనుకోవట్లేదు – బండి సంజయ్

-

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి అనుకోవడం మూర్ఖత్వం అన్నారు బండి సంజయ్. సిరిసిల్ల పట్టణములో నియోజకవర్గ స్థాయి విసృత సమావేశానికి హాజరయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ… ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలి అనుకునేవాడు మూర్ఖుడు… ముఖ్యమంత్రి కావాలని నేను అనుకోవట్లేదని వెల్లడించారు.

కేసిఆర్ కోడుకు కాకుంటే కేటీఆర్ ని ఎవరు దేకరు… కేటీఆర్ భాష, అహంకారం చూసి వాళ్ళ పార్టీ వాళ్ళే సిగ్గుపడుతున్నారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు అందుకే వాళ్లని అరెస్టు చేయరు. బీజేపీ వాళ్ళనే అరెస్టు చేస్తారని…కేసిఆర్ బిడ్డ, కోడుకు , అల్లుడు ఆస్తులు ఎంతో స్పష్టం చేయగలరా అని నిలదీశారు. అన్నిటికీ మేమే ఇస్తున్నాం అంట్టున్నరు కానీ ఏమి ఇస్తలేరన్నారు. అధికారంలోకి రాగానే చేనేత రంగానికి సెస్ నుండి సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version