కాంగ్రెస్ లోకి కొందరు కోవర్ట్‌లను పంపాం – బాల్క సుమన్ సంచలనం

-

కాంగ్రెస్ లోకి కొందరు కోవర్ట్‌లను పంపామంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మంచిర్యాల లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రచారంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనవాళ్ళేనని… మనమే కొందరిని పార్టీ లోకి పంపించామంటూ సంచలనానికి తెరలేపామన్నారు.

రాజకీయాలు అన్నప్పుడు కొన్ని తెలివి తేటలు ప్రదర్శిస్తాం కదా అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లు అక్కడక్కడ తిరిగితే ఎం అనవద్దు…సోషల్ మీడియాలో ట్రోల్ చేయొద్దని కోరారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఎన్నికలు అయ్యాక వాళ్లు మన పక్కనే ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కనిపిస్తే ఏమీ అనకండి. వాళ్లు మనోళ్లే. మనమే కొందరిని పంపించాం కూడా. ఎన్నికలయ్యాక మళ్లీ మన పార్టీలోకి వస్తారన్నారు బాల్క సుమన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version