దమ్ముంటే యాదాద్రికి రా కేసీఆర్.. ప్రమాణం చేద్దాం : బండి సంజయ్

-

రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇదంతా సీఎం కేసీఆర్ అల్లిన కథ అని ఆరోపించారు. అన్ని ఛానళ్లలో బీజేపీ అని చెబుతున్నారని.. కేసీఆరే మీడియాతో అలా చెప్పిస్తున్నారని మండిపడ్డారు.

తాను రేపు యాదాద్రికి వెళ్తానని.. దమ్ముంటే కేసీఆర్ కూడా రావాలని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఎదుట ప్రమాణం చేద్దామని అన్నారు. ఈ విషయంపై కోర్డును ఆశ్రయిస్తామని వెల్లడించారు. తమ పార్టీ న్యాయ పరంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

”ఒక్క ఉపఎన్నిక కోసం.. కేసీఆర్ ఇన్ని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఎట్లా ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలు మానుకో కేసీఆర్.. అభివృద్ధిపైన దృష్టి పెట్టు.. అంతే కానీ ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు. ఎమ్మెల్యేల కోనుగోలు కోసం డబ్బులు పంచామని ఆరోపిస్తున్నారు.. అసలు ఎవరో తెలియదు వాళ్లు బీజేపీ అని అంటున్నారు. వాళ్లు కచ్చితంగా టీఆర్ఎస్సే ”- బండి సంజయ్

Read more RELATED
Recommended to you

Exit mobile version