జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ

-

కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం ఇచ్చినందుకు జేపీ నడ్డా కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డాకు కండువా కప్పి సన్మానించారు బండి సంజయ్. ఆ పార్టీ సీనియర్ నేత రాద్దామోహన్ అగర్వాల్ తో కలిసి జేపీ నడ్డాని కలిశారు.

20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అధిష్టానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. కేంద్రంలో బిజెపిని మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version