కవిత బెయిల్ కోసం వాదించిన అభిషేక్ సింఘ్వీకి కాంగ్రెస్ తెలంగాణలో రాజ్యసభ టిక్కెట్ ఇచ్చింది నిజం కాదా? అంటూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని… బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం అన్నారు. ఒక పార్టీ, ఒక వ్యక్తి చెబితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందనడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ వ్యాఖ్యలున్నాయి. అందుకే కోర్టు హెచ్చరించిందని చురకలు అంటించారు.
కవిత బెయిల్ కోసం వాదించిన అభిషేక్ సింఘ్వీకి కాంగ్రెస్ తెలంగాణలో రాజ్యసభ టిక్కెట్ ఇచ్చింది నిజం కాదా? రాజ్యసభ ఎన్నికల్లో 38 మంది ఎమ్మెల్యేలున్నా బీఆర్ఎస్ ఎందుకు నామినేషన్ వేయలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందంవల్లే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీనం మాట ముచ్చట పూర్తయ్యింది… అమెరికాలో అప్పగింతలు కాబోతున్నయ్… బీఆర్ఎస్ తో కలిసి పనిచేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ కార్యకర్తలు కొట్లాడితే… అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టిన చరిత్ర బీజేపీదేనని… బీజేపీ కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకం… కలలో కూడా బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని వెల్లడించారు.