పసుపు బోర్డుకు కేంద్రం ప్రత్యేక నిధులు

-

నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.


ఈరోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుండి వర్చువల్ గా హాజరై ప్రసంగిస్తూ బోర్డు ఏర్పాటు కోసం క్రుషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ప్రతి ఏటా పసుపు బోర్డుకు కేంద్రం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ప్రక్రుతి వైపరీత్యాలవల్ల పంట నష్టపోతే రైతులు నష్టపోకుండా పంట బీమాకు చర్యలు తీసుకుంటుందని బండి సంజయ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news