రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అనడం కరెక్ట్ కాదు – బండి సంజయ్

-

రేవంత్ రెడ్డి, బాల్క సుమన్‌ ఎపిసోడ్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అనడం కరెక్ట్ కాదు.. బీఆర్ఎస్ నాయకుల భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ లో ఎంపీ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ… ప్రభుత్వం 200 యూనిట్లకు ,500గ్యాస్ సిలిండర్ హామీలకు వ్యతిరేఖం కాదు..కానీ కొర్రీలు పెట్టద్దని కోరారు.

bandi sanjay reaction on balka suman episode

మ్యానిఫెస్టోలో రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకే అని చెప్పలేదు అందరికి స్కీంలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వాలి… వారం రోజుల్లో ఇవ్వచ్చన్నారు. 10 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేశారు.. ఆ తర్వాత కరంటు, గ్యాస్ ఇవ్వాలి అప్పుడే ప్రభుత్వ నిబద్ధత తెలుస్తుందని వివరించారు. ఎన్నికల షెడ్యూల్ ఎపుడైనా రావచ్చు….నిజాయితీ ఉంటే 6 గ్యారంటీలను ఎన్నికల షెడ్యూల్ లోపల అమలు చేయాలని కోరారు. ఎకరానికి 15 వేలు,మహిళలు కు 2500, పెన్షన్, ఇళ్ల స్థలాలు, 2 లక్షల రుణమాఫీ, నోటిఫికేషన్ ,317 జిఓ, నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు… ఇవి నెరవేర్చడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటో చెప్పాలని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version