కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా..? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా..? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విచ్ఛలవిడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్మిందని.. మద్యం టెండర్ల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతాంగం, మహిళలు మన బ్రతుకులను మనం బాగు చేసుకుందాం.
కల్వకుంట్ల రాష్ట్రం కావాలా..? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల రాజ్యాంగానికి.. బాబా సాహెబ్ రాజ్యాంగానికి తేడా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. వీరి మధ్యలో ఎంఐఎం మద్యలో చేరింది. ఈ రెండు పార్టీలకు ఎంఐఎం మధ్య వర్తిత్వం వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉండి.. తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ డబ్బులను పంపిణీ చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు డబ్బులు సరఫరా చేస్తుందని ప్రజలు కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో విచ్ఛలవిడిగా గంజాయి.. డ్రగ్స్ వాడుతున్నారు. బీఆర్ఎస్ కి 6 సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టం చేశారు బండి సంజయ్.