ఓల్డ్ సిటీ, ఒవైసీ ఆసుపత్రి ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. RSS ఆఫీస్ లో దేశ భక్తులు ఉంటారు. RSS ను ఎవరైనా విమర్శిస్తే.. వాళ్లకు ఈ దేశంలో నూకలు చెల్లినట్టేనని.. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మరోవైపు వక్ఫ్ బోర్డు బిల్లుపై మస్లీద్ నేత అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారని ఒవైసీ లాంటి ఎంత మంది నేతలు వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు ఆగదు అన్నారు. మజ్లీస్ పార్టీయే అసలైన దేశ ద్రోహ పార్టీ అని ఆరోపించారు. త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం తధ్యం అన్నారు. మతం కోణంలో ఆలోచించి దీనిని అడ్డుకోవడం సరికాదన్నారు. దేశం ప్రజల కోసం మోడీ ప్రభుత్వం మరిన్నీ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని ఉద్ఘాటించారు.