సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే 163 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. తొలుత బ్యాటింగ్ చేసిన SRH జట్టు ట్రావిస్ హెడ్ 22, అభిషేక్ వర్మ 1, ఇషాన్ కిషన్ 2, నితీష్ రెడ్డి 0, అంకిత్ వర్మ 74 పర్వాలేదనిపించాడు. క్లాసెన్ 32, మనోహర్ 4, కమిన్స్ 2, మల్డర్ 9, హర్షల్ పటేల్ 5, షమీ 1 పరుగు సాధించారు. దీంతో 18.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లు జేక్ ఫ్రేసర్ 38, డూప్లిసిస్ 50, అభిషేక్ పోరెల్ 34, రాహుల్ 15, స్టబ్స్ 21 పరుగులు సాధించారు. కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్షక్యాన్ని ఛేదించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.