కరీంనగర్ లో తన పార్లమెంట్ ఆఫీస్, ఇంటి దగ్గర ఎంఐఎం కార్యకర్తలు దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించాడు. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీని ఎదుర్కోలేకపోతుందని మండిపడ్డారు. బీజేపీ నాయకులు ప్రశ్నిస్తే.. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ఎంఐఎం దేశ ద్రోహుల పార్టీ అని విమర్శించారు బండి సంజయ్. తన ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భాగ్యలక్ష్మీ గుడి వద్ద జనగణమన, వందేమాతరం పాడే దమ్ము బీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు ఉందా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిజాం వారసులం కాదు అని బీఆర్ఎస్ నిరూపించుకోవాలి.. బీజేపీ దాడులకు భయపడదు. మా సహనాన్ని పరీక్షించవద్దు. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు బండి సంజయ్. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్టే నడవాలంటూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. మీరు దేశ భక్తులా..? ఏ దేశానికి..? పాకిస్తాన్ కా..? ఆప్ఘనిస్తాన్ కా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు.