సీఎం కేసీఆర్‌కు బండి సజయ్ సవాల్.. దమ్ముంటే చర్చకు రా !

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు బండి సజయ్ సవాల్ విసిరారు. తెలంగాణా రాష్ట్ర కేసీఆర్ ఇచ్చిన హామీలెన్ని నెరవేర్చారు, రెండు నెలల నుంచి పెన్షన్ ఇస్తలేరని ఆగ్రహించారు బండి సంజయ్‌. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది, అభివృద్ధి నిధులపై కేసీఆర్ చర్చకి వస్తారా అని నిలదీశారు బండి సంజయ్. కేసీఆర్, మోడీకి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని.. కేసీఆర్ ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు అంటూ విరుచుకుపడ్డారు.

మోదీ క్యాబినెట్ పై ఒక్క అవినీతి మరక లేదని.. కేసీఆర్ క్యాబినెట్ లో అవినీతి మరక లేని మంత్రి లేడని విమర్శలు చేశారు. కేసీఆర్ ఎం చేస్తున్నారు.. రోజు వారీ షెడ్యూల్ ఎందుకు బయటపెట్టడం లేదని.. నీతి అయోగ్ సమావేశానికి వెళ్లరు… ప్రధాని వస్తె కలవరంటూ ఆగ్రహించారు.మోదీ దోస్తీ అంటివి.. మోడీ నీకు(కేసీఆర్) ఎట్ల దోస్తీ అయ్యారు ? అని ఆగ్రహించారు బండి సంజయ్‌. బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసి కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచేందుకే కేసీఆర్ కుట్ర అని… అందులో భాగమే మోదీ దోస్త్ అంటూ జిమ్మిక్కులు అని ఫైర్‌ అయ్యారు.తెలంగాణ బీజేపీ ప్రభుత్వమే వస్తుందన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version