నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ సీపీకే.. అందుకే రౌడీలా ప్రదర్శిస్తున్నాడు : బండి సంజయ్‌

-

నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ సీపీకే.. అందుకే అలా రౌడీలా ప్రదర్శిస్తున్నాడని స్థానిక సీపీపై బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. బోధన్ లో హిందూ యువకులు పై ఎం ఐ ఏం, టీ ఆర్ ఎస్, పోలీసులు కలిసి దాడి చేశారని.. బోధన్ లో శివాజీ విగ్రహం పెట్టడం కోసం మున్సిపాలిటీ తీర్మానం చేసిందన్నారు. రాళ్ళ దాడి చేయడం మూర్ఖత్వం,తీవ్రంగా ఖండిస్తున్నామని.. సీపీ నానా బూతులు తిట్టి, లాఠీ చార్జీ చేశారని ఆగ్రహించారు.

గాల్లో రబ్బరు బుల్లెట్లు కాల్పులు చేశారని.. నిజామాబాద్ సీ పీ గతంలో ఎంపీ అవుతానని ప్రకటించాడని ఓ రేంజ్‌ లో ఆగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశిస్సులు తో కొందరు ఐ ఏ ఎస్ లు ప్రవర్తిస్తున్నారని.. సిపీకి సిగ్గుండాలి,రౌడి లా ప్రవర్తించాడు అధికారులు సంఘాలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు.

శివాజీ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా.. బైంసా లో జరిగినట్లే బోధన్ లో జరిగిందన్నారు. నీ లాంటి వాళ్ళని వదిలి పెట్టె ప్రసక్తి లేదని.. ప్రభుత్వం శివాజీ జయంతి చేస్తే అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఎంఐఏం ఏది చెప్తే రాష్ట్రంలో అది అమలు అవుతుందని.. సిరిసిల్ల లో 25 మంది బీజేపీ కార్యకర్తలపై అటెంట్ మర్డర్ కేసు పెట్టారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version