హైదరాబాద్‌లోకి అక్రమంగా బంగ్లా దేశీయులు

-

బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశీయులు భారత్లోకి అక్రమంగా చొరబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పలువురు బంగ్లాదేశీయులు నగరానికి చేరుకున్న సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

ఇక ఇటీవల కోల్‌కతా నుంచి ఐదుగురు మైనర్లు ఖమ్మంలో ఆపరేషన్ ముస్కాన్లో పట్టుబడగా వారిని సొంతదేశానికి పంపారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా పశ్చిమబెంగాల్‌లోకి చొరబడిన నలుగురు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దొరికారు. ఇలా రెండేళ్లలో దాదాపుగా వేయి మంది నగరానికి అక్రమంగా వచ్చారు. ఇక్కడికి వచ్చిన వారు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ.. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి మాల్టా వద్ద సరిహద్దు దాటించి రైళ్లలో భారత్కు పంపుతున్నారు. అలా పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ చేరుకుంటూ ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా పనిలోకి దిగుతున్నారు. ఇక ప్రస్తుతం బంగ్లాలో అల్లర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అక్రమంగా చొరబడే వారి సంఖ్య అధికమయ్యే నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై నగరవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version