ఏపీ ప్రజలకు షాక్‌…ఆ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలని సర్కార్‌ నిర్ణయం !

-

ఏపీ ప్రజలకు షాక్‌…ఆ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరుగుతున్న భూ కుంభకోణాలపై కెబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. అసైన్డ్, 22-A భూములను ఫ్రీ హోల్డ్ చేసి భారీ కుంభకోణానికి తెర లేపారని ఏపీ మంత్రులు వెల్లడించారు. సుమారు 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారని.. 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారని అధికారులు పేర్కొనడం జరిగింది.

AP Cabinet took important decisions

వివాదంలో ఉన్న ప్రతి రిజిస్ట్రేషన్ను.. ప్రతి అర్జీని పరిశీలించాలని మంత్రులు వెల్లడించారు. ఇంత భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లను పరిశీలించడం కష్టమని అధికారులు చెప్పారట. ఇక ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సభలు పెట్టి.. ప్రతి అర్జీని వెరిఫై చేయాలని చంద్రబాబు ఆదేశించారు. భూ వివాదాలు ఓ కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలని మంత్రులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లను ఆపడానికి సాంకేతిక ఇబ్బందులు ఉంటాయని అధికారులు వెల్లడించారట. ప్రజల నుంచి భారీ ఎత్తున అర్జీలు వస్తే.. పరిష్కారం కోసం ఫ్రీహోల్డ్ చేసిన భూముల రిజిస్ట్రేషన్ను ఆపితే తప్పేం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తప్పులు చేసే వారిని చట్టాల పేరుతో వదిలిపెట్టలేమని స్పష్టం చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version