Telangana: లోన్లు కట్టాలని రైతులకు లీగల్ నోటీసులు పంపుతున్న బ్యాంకులు !

-

తెలంగాణ రైతన్నలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే రైతు బంధు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతుంటే..బ్యాంక్‌ అధికారులు.. రైతులకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న లోన్లు కట్టాలని రైతులకు లీగల్ నోటీసులు పంపుతున్నాయి బ్యాంకులు. దీంతో గందరగోళానికి లోనవుతున్నారు రైతులు. కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన 2 లక్షల రుణ మాఫీ ఉత్త మాటేనా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Banks are sending legal notices to farmers to pay loans

అటు  5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం.

వ్యవసాయ పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివరలో పంట సాయం అందించే ఆలోచన ఉందట. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు వేయనున్నట్లు తెలిపారు. 5 ఎకరాల వరకే రైతు బంధు అనడంతో.. కొంత మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version