నేడు బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో బీసీ నేతలు భేటీ కానున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్, కులగణన అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో… పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, బీసీ ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇక అటు నాడు కేసీఆర్ గారి పాలనలో ఎండాకాలంలో దుంకిన మత్తడులు ఉన్నాడని… నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న వరి మడులు దర్శనం ఇస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. నాడు ఉప్పొంగిన గంగమ్మ… నేడు అడుగంటుతున్న భూగర్భజలాలు అంటూ చురకలు అంటించారు.