మేడ్చల్ జిల్లా పరిధిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. జిల్లాలోని ముత్వేల్లిగూడలో నలుగురు దుండగులు అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు. అమెరికాలో ఉంటున్న యజమాని సీసీటీవీలో చూసి పక్కింట్లో ఉండే వారిని అలర్ట్ చేశాడు.
దీంతో అమెరికాలో ఉండే ఓనర్ బంధువు పొరుగింటి వారి సాయంతో దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వీరి అలికిడి విని దొంగలు అలర్ట్ అయి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు దొంగలు దొరకగా మరో ఇద్దరు పారిపోయారు.దొరికిన వారికి దేహశుద్ధి చేసిన స్థానికులు దొంగలను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అర్ధరాత్రి దొంగలు హల్చల్
మేడ్చల్ జిల్లా ముత్వేల్లిగూడలో నలుగురు దుండగులు అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు. అమెరికాలో ఉంటున్న యజమాని సీసీటీవీలో చూసి ప్రక్కనే ఉండే బందువును అలెర్ట్ చేశాడు. గమనించిన దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. ఇద్దరు దొంగలు దొరకగా మరో ఇద్దరు… pic.twitter.com/GWPAlrAvjt
— ChotaNews App (@ChotaNewsApp) February 8, 2025