తెలంగాణ విద్యార్థులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. బీసీ విదేశీ విద్య పథకం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మహాత్మ జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్య పథకం దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు.
నేటితో గడువు ముగియనుండగా అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నామని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోంది. సైట్ : https://telanganaepass.cgg.gov.in/
కాగా,సొంత స్థలం ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ. 3 లక్షలు అందించనుంది. ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానించగా 15 లక్షల వరకు అందాయి. వాటిల్లో 11 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా ఎంపిక చేశారు. అయితే అక్టోబర్ నెల 5వ తేదీ నాటికి మొత్తం మూడున్నర లక్షల మంది లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి అందాలని సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.