బీసీలకు డిప్యూటీ సీఎం పదవీ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట పట్టణ కేంద్రంలో శ్రీ కృష్ణ యాదవ పంక్షన్ హాల్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఫంక్షన్ లకు వచ్చే డబ్బులను పేద విద్యార్థుల ఖర్చు చేయాలని సూచించారు. కేసీఆర్ ఉన్నప్పుడు యాదవుల గొప్పతనం అసెంబ్లీలో చెప్పారని, యాదవులకు ఎన్నో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని గుర్తుకు చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు వారికి ఒక్క మంత్రి పదవీ కూడా ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసారు. కులగణన పేరుతో దొంగ సర్వే చేశారు. బీసీ సంఖ్యలను తగ్గించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. రేవంత్ రెడ్డి ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదని.. 42 శాతం రిజర్వేషన్ తెచ్చిన తరువాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసారు.