గిరిజన మహిళ ఈశ్వరమ్మకు మెరుగైన వైద్యాన్ని అందించాలని నిమ్స్ హాస్పిటల్ డైరక్టర్ కు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి పై మంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈశ్వరమ్మ వైద్యానికి అవసరమైన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది…ఈశ్వరమ్మ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ భరోసా కల్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, మొలచింతలపల్లికి చెందిన గిరిజన మహిళ ఈశ్వరమ్మ (25) పై పాశవికంగా దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించటం జరిగిందన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో శ్రీమతి ఈశ్వరమ్మ కు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి దామోదర్ రాజనర్సింహ డైరెక్టర్ డా . బీరప్ప గారిని టెలిఫోన్ లో ఆదేశించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు ఆరా తీయాలని కోరారు. గిరిజన మహిళ ఈశ్వరమ్మ వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వెల్లడించారు. అమె కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి దామోదర్ రాజనర్సింహ భరోసా ఇచ్చారు.