బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన టీవీ ఆర్టిస్టులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు పంజాగుట్ట పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. వారిలో నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలు ఉన్నారు.
ఇదే కేసులో ఇన్వాల్వ్ అయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ మరియు యూట్యూబర్ హర్ష సాయి దుబాయ్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే, నోటీసులు అందుకున్న వారు గురువారం పంజాగుట్ట స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. హీరోయిన్, హీరోలతో పాటు మరి కొంతమందిపైనా పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.