6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు : భట్టి విక్రమార్క

-

గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యం అని చెప్పారు. పారదర్శకత జవాబుదారితనంతో ముందుకెల్తున్నామన్నారు. రాష్ట్రంలో సంక్సేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. 

bhatti

ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు, మహాలక్ష్మి పథకానికి – రూ.4,305 కోట్లు, గృహజ్యోతి పథకానికి – రూ.2,080 కోట్లు, సన్న బియ్యం బోనస్‌కు – రూ.1800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి – రూ.1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి – రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు – రూ.600 కోట్లు  కేటాయించినట్టు తెలిపారు. అలాగే పశుసంవర్థకం రూ.1,674, పౌరసరఫరాల శాఖ 5,734 కోట్లు, కార్మిక శాఖ రూ.900 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ రూ.2,862 కోట్లు, బీసీ సంక్షేమ శాఖ 11,405 కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖ రూ.3,591 కోట్లు, పరిశ్రమలు రూ.3,527 కోట్లు, ఐటి రంగం రూ.774 కోట్లు, చేనేత రంగానికి రూ.371 కోట్లు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news