తెలంగాణ గిరిజనులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందిర గిరి జల వికాసం అనే పేరుతో నూతన స్కీమ్ ను అమలు చేయనున్నట్టు తెలిపారు. పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందివ్వనుంది. 2.1లక్షల రైతులకు ఈ సౌకర్యం కల్పించనుంది ప్రభుత్వం.

రాబోయే నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధికి రూ.12,600 కేటాయిస్తామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి జోడు గుర్రాలు అని తెలిపారు. మరోవైపు బడ్జెట్ లో రైతు భరోసాకు రూ.18వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఏడాదికి ఎకరానికి రూ.12వేల చొప్పున అందుతాయని.. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతుభరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్ గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం.