భద్రాద్రి రామయ్య భక్తులకు అలర్ట్. రామయ్య సన్నిధిలో భక్తులకు ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనాలు అందుబాటులోకి వచ్చాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ ఈ బ్రేక్ దర్శనాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు, సాయంత్రం 7 గంటల నుంచి ఏడున్నర వరకు బ్రేక్ దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.
ఇందుకోసం డ్రెస్ కోడ్ నిబంధన అమల్లోకి తెచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. డ్రెస్ కోడ్ ఉన్న వారిని స్వామి వారి బంగారు వాకిలి వరకు లేని వారిని వెండి వాకిలి వరకు దర్శనానికి అనుమతిస్తారని చెప్పారు. బ్రేక్ దర్శనం కోసం టికెట్ ధర 200 రూపాయలుగా నిర్ణయించారు. ఈ టికెట్లను ఆన్లైన్ తో పాటు ఆలయ ప్రాంగణంలోని టికెట్ కౌంటర్ లో కూడా తీసుకోవచ్చని వెల్లడించారు.
మరోవైపు స్వామి వారి దర్శనానికి ఇవాళ పెద్దఎత్తున భక్తులు పోటెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామునే సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.