రేపు అమరావతి మీద శ్వేత పత్రం విడుదల

-

ఇవాళ మూడు శాఖల పని తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై సమీక్ష ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై చర్చించనున్న ఏపీ సీఎం….పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చించనున్నారట. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణ ఉన్నాయని సమాచారం.

White paper release on Amaravati tomorrow

గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో టీడీపీ ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా రోడ్ల మరమ్మత్తుల పై ఫోకస్ పెట్టనుంది ప్రభుత్వం. అటు రేపు అమరావతి మీద శ్వేత పత్రం విడుదల చేయనుంది. రాజధాని పరిస్థితుల పై వైట్ పేపర్ విడుదలకు తుది కసరత్తులో మంత్రి నారాయణ ఉన్నారట. రేపు శ్వేత పత్రం విడుదల చేస్తున్నందున్న సీఎంకు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు నారాయణ, అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version