జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించండని డిమాండ్ చేశారు భట్టి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు బట్టి సంఘీభావం తెలిపారు.
ఓవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బాధపడుతుంటే. ఉద్యోగాలు చేస్తున్న వారిని ప్రభుత్వం వివిధ కారణాలతో వేధిస్తుందని ఆయన ఫైర్ అయ్యారు.. మూడు సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని నాలుగు సంవత్సరాలకు పెంచడం అన్యాయమని బట్టి అన్నారు.. నాలుగు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న వారి ప్రొవైషనరి కాలాన్ని డిక్లేర్ చేయకపోవడానికి ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల విషయంలొ తెలంగాణ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని.. జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల నడ్డి విరుస్తుందని పట్టి ఫైరయ్యారు.