ధరణిని పూర్తిగా ఎత్తివేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

-

ధరణి పోర్టల్ ను పూర్తిగా ఎత్తివేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. భూ వివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని తెలిపారు. ధరణిలో అనుభవ కాలమ్ ను తీసేసి, పట్టాదారు కాలమ్ ను మాత్రమే ఉంచారని, దీనివల్ల చాలామంది పేదలు తమ భూములపై హక్కులు కోల్పోయారని అన్నారు.

ఆ పరిస్థితులను మార్చడం కోసం ధరణిని పూర్తిగా ఎత్తివేయనున్నట్లు పేర్కొన్నారు. గద్దర్ జయంతి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మాట ఇచ్చాము..కింది స్థాయి అధికారులు చేసిన పనుల కొంత ఇబ్బంది పడ్డారని వెల్లడించారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల విగ్రహ స్థల కేటాయింపు విషయం ఆలస్యం జరిగిందని..ఇందిరమ్మ రాజ్యం రావాలని గద్దర్ కోరుకున్నారని వివరించారు. నాతో పాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నడిచి వచ్చేవాడని..గద్దర్ ఆలోచన లు మాతో పంచుకున్నాడని పేర్కొన్నారు. అయన ఆలోచన లు అమలు చేయడం తో పాటు…గద్దర్ పేరు మీద అవార్డు ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news