లోక్ సభ టికెట్ల కోసం ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. తొలిరోజు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నాగర్ కర్నూల్ సీటుకు మల్లు రవి, ఆయన కుమారుడు సిద్ధార్థ్, చారకొండ వెంకటేష్ దరఖాస్తు చేసుకున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/02/Malluravi-Tinmar-Mallanna-application-for-MP-tickets.webp)
భువనగిరి టికెట్ కోసం తీన్మార్ మల్లన్న, కైలాష్ నేత, మహబూబాబాద్ స్థానానికి చందా లింగయ్య, వరంగల్ సీటుకు ఆనంద్ కుమార్ అప్లికేషన్లు సమర్పించారు. అయితే..భువనగిరి ఎంపీ టికెట్ కోసం తీన్మార్ మల్లన్న దరఖాస్తు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.