డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క..?

-

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క సీతక్క ప్రమాణం శ్రీకారం చేసేందుకు ముహూర్తం ఖరార్ అయింది. వీరి పేర్లను అధ్యక్షుడు మల్లికార్జున గారికి మరికొద్ది సేపట్లోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. రాత్రి 8 గంటలకు రాజ్ భవన్ లోని ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఎస్సీ వర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క ఎస్టి వర్గం నుంచి సీతక్కకు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 175 మంది ఆసీనులు అయ్యే విధంగా అరేంజ్మెంట్ చేసినట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని రాజ్ భవన్ సెక్రటేరియట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగానికి చేరవేర్చింది ఏఐసిసి అధ్యక్షుడు కార్గేయనించి ఆదేశాలు సాయంత్రంలోగా రానున్నాయి. ఇందుకు అనుకూలంగా ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న డీకే శివకుమార్ మురళీధరన్ దీప దాస్ మున్సీ తదితరులు హాజరుకానున్నారు. డిప్యూటీ సీఎం గా సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ సహా మరికొన్ని బాధ్యతలు దక్కనున్నాయి మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ పౌరసరఫరాల శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో కనీసం ఇద్దరి కంటే ఎక్కువగా మహిళలు ఉంటారని సమాచారం. మిగిలిన కేబినెట్ మంత్రులను ఖరారు చేయడంపై నాలుగైదు రోజుల్లో కసరత్తు పూర్తి కానుంది ఈనెల తొమ్మిదో తేదీన మంత్రివర్గ విస్తరణ కార్యం ఉండవచ్చు అని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version