ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్ మంజూరు

-

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు మరో ఇద్దరికి బెయిల్ మంజూరు అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధా కిషన్ రావుకు బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు లక్ష రూపాయలతో కూడిన రెండు షూరిటీలు సమర్పించాలని భుజంగరావు, రాధా కిషన్ రావుకు షరతు విధించింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు.

Bhujanga Rao, Radha Kishan Rao granted bail in phone tapping case

అలాగే… పాస్‌పోర్టులు సమర్పించాలని భుజంగరావు, రాధా కిషన్ రావుకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భుజంగరావు, రాధా కిషన్ రావు ఇద్దరూ కూడా దర్యాప్తుకు సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇక అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ మంజూరు అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న. ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news