తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగి హల్చల్..!

-

తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్​చల్ చేశాడు. తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్​చల్ చేయడంతో.. సర్కార్‌ అలర్ట్‌ అయింది. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టింది ఇంటెలిజెన్స్. పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా నకిలీ ఉద్యోగి ని… ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పట్టుకున్నారు.

Telangana Secretariat

రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్నాడట ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావు ఫేక్ ఐడీ కార్డు తయారు చేసినట్లు గుర్తించారు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్. డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్.. పోలీసులకు అప్పగించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news