భువనగిరి హాస్టల్ గదిలో ఉరేసుకున్న టెన్త్ విద్యార్థినుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10వ తరగతి చదువుతున్న భవ్య (15), వైష్ణవి (15), వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ శైలజకు ఫిర్యాదు చేశారు, హాస్టల్ వార్డెన్ మందలించడంతో, భవ్య, వైష్ణవిలు చున్నీలతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు.
సూసైడ్ నోట్ రాసి మరి..భవ్య, వైష్ణవిలు చున్నీలతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో “మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి. మా ఆఖరి కోరిక ఇది” అంటూ భవ్య, వైష్ణవి రాశారు. దింతో సంఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా భువనగిరి హాస్టల్ గదిలో ఉరేసుకున్న టెన్త్ విద్యార్థినుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భవ్య, వైష్ణవి మృతదేహాలపై పండ్లతో కొరికిన గాయాలు, వాతలు ఉన్నాయ్. లేడీస్ హాస్టల్ లోకి వచ్చిన కొందరు ఆటో డ్రైవర్లు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.